calender_icon.png 22 December, 2024 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్ రాహుల్ అనుమానమే!

22-12-2024 12:18:26 AM

భారత్, ఆసీస్ నాలుగో టెస్టు

మెల్‌బోర్న్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలు గో టెస్టుకు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడేది అనుమానంగా మారింది. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రాక్టీస్ సందర్భంగా రాహుల్ కుడి చేతికి బంతి తగిలింది. బ్యా టింగ్ సమయంలో కాస్త అసౌకర్యానికి గురై న రాహుల్ జట్టు ఫిజియో వద్ద ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమం లో వైరల్‌గా మారాయి.

అయితే రాహుల్ గాయంపై జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి గాయం తీవ్రత పెద్దగా లేదని తేలింది. అయితే నాలుగో టెస్టుకు మరో ఐదు రోజులు సమయం ఉండడంతో రాహుల్ అప్పటివరకు కోలుకునే చాన్స్ ఉంది. ఈ సిరీస్‌లో భారత్ తరఫున కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 235 పరుగులు సాధించాడు.