calender_icon.png 20 November, 2024 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతలు స్వీకరించిన కేకే

21-07-2024 01:28:25 AM

ప్రభుత్వ సలహాదారుగా సేవలందించనున్న మాజీ ఎంపీ

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా మాజీ ఎంపీ కె. కేశవరావు శనివారం పదవీ భాద్యతలు స్వీకరించారు. సచివాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కేశవరావును పుష్ప గుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి అభినందించారు.