calender_icon.png 10 January, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ గూటికి కేకే

04-07-2024 12:49:33 AM

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే 

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణలో చేరికల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరగా, తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు బుధవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కేకే భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఖర్గే  నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేకే కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిబీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పుడే కేకే కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది.