calender_icon.png 30 September, 2024 | 12:51 AM

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేకే?

29-09-2024 12:22:03 AM

అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నో!

తెరమీదకు మహేందర్‌రెడ్డి పేరు

కరీంనగర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల నియోజకవ ర్గంలో పోటీ చేసేందుకు అధికార పార్టీ నుం చి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజు కూ పెరుగుతున్నది. తాజాగా సిరిసిల్ల నియోజకవర్గా నికి చెందిన సీనియర్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది.

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరును అధిష్టానం పరిశీలనలోకి తీసుకు న్నప్పటికీ ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో కేకే పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేకే మహేందర్‌రె డ్డి 2008 నుంచి వరుసగా బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు.

తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది అయిన కేకేను బరిలో ది ంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన అధిష్టాన ం చేస్తున్నట్లు తెలిసింది. అధిష్టానం ఒకే అం టే పోటీ చేసేందుకు కేకే సిద్ధంగా ఉన్నట్టు స మాచారం. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పెద్దలను కలిసి తన ప్రచారాన్ని ముమ్మరం చేశా రు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎ ంపీ స్థానానికి పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసేందు కు సిద్ధమవుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానం ను ంచి తొలిసారి గెలిచిన సీనియర్ జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ సైతం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరమే కాంగ్రెస్ అ ధిష్టానం తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టి జీవన్‌రెడ్డి తిరిగి తానే పోటీ చేస్తానని అధిష్టానంపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆశావహులంతా వెనక్కితగ్గాల్సిందే.