హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సీనియర్ నేత కే కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కేశవరావు ప్రభుత్వ సలహాదారు(పబ్లిక్ అఫెయిర్స్) గా కేబినెట్ హోదాలో ఉంటారు.