calender_icon.png 8 January, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కివీస్‌దే టీ20 సిరీస్

03-01-2025 12:00:00 AM

మూడో టీ20లో లంక విజయం

నెల్సన్: స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 2 సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో శ్రీలంక ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (46 బంతుల్లో 101) సెంచరీతో కదం తొక్కాడు. అసలంక (46) రాణించాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, ఫౌల్క్స్, సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (69), టిమ్ రాబిన్సన్ (37) రాణించారు. లంక బౌలర్లలో అసలంక 3 వికెట్లు తీయగా.. హసరంగ 2 వికెట్లు పడగొట్టాడు.