వెల్లింగ్టన్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన జోష్‌లో ఉన్న కివీస్ 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి వన్డే లో కూడా విజయం సాధించింది. ఈ వన్డే లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యా టింగ్‌కు దిగిన లంక 43.4 ఓవర్లలో 178 పరుగులకే చాపచుట్టేసింది. మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. 179 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (90*) చెలరేగడంతో 26.2 ఓవర్లలోనే విజయం సాధించింది. మ్యాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.