calender_icon.png 21 October, 2024 | 8:42 AM

కివీస్ టార్గెట్ 107

20-10-2024 12:00:00 AM

  1. సర్ఫరాజ్ తొలి టెస్టు శతకం
  2. పంత్ సెంచరీ మిస్
  3. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 ఆలౌట్

బెంగళూరు: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా గెలవడం అసాధ్యంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ ముంగిట భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని విధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ పరుగులేమి చేయలేదు. క్రీజులో టామ్ లాథమ్, డెవన్ కాన్వే ఉన్నారు.

వర్షం అంతరాయం లేదా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప  టీమిండియాకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అంతకముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (150) టెస్టుల్లో తొలి శతకం అందుకోగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మాట్ హెన్రీ, విలియం రూర్కీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఎజాజ్ పటేల్ 2 వికెట్లు తీశాడు. 

సర్ఫరాజ్ తొలి సెంచరీ..

231/3 క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ను సర్ఫరాజ్, పంత్ తమ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు.  70 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ ఆరంభించిన సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లో సెంచరీ మార్క్ సాధించి టెస్టు కెరీర్‌లో తొలి శతకం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వేగంగా ఆడిన పంత్ 55 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు.

ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 120 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. 2001 కోల్‌కతా టెస్టును రిపీట్ చేస్తారా అన్నట్లు టీమిం డియా ఇన్నింగ్స్ సాగింది. అయితే నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించిన అనంతరం 408 పరుగుల వద్ద సర్ఫరాజ్ వెనుది రిగాడు.  408/3తో పటిష్టంగా కనిపించిన టీమిండియా 52 పరుగుల వ్యవధిలో మిగ తా ఏడు వికెట్లను కోల్పోవడం గమనార్హం. 

గెలిస్తే 36 ఏళ్ల తర్వాత..

మ్యాచ్‌లో న్యూజిలాండ్ నెగ్గితే 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు విజయం అందుకోనుంది. చివరగా 1989లో రిచర్డ్ హడ్లీ నేతృత్వంలోని కివీస్ జట్టు వాంఖడే టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐదోరోజు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటి కీ టార్గెట్ చిన్నది కావడంతో కివీస్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.