calender_icon.png 10 January, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ ప్రదేశాల్లోనే పతంగులు ఎగురవేయాలి

09-01-2025 05:07:11 PM

నిర్మల్ (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో పిల్లలు గాలిపటాలను ఖాళీ ప్రదేశాల్లో ఎగురవేసే విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుదర్శన్ అన్నారు. ఈనెల 11 నుంచి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు గాలిపటాలను దాబాలపై విద్యుత్ వైర్ల కింద ఎగరవేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వైర్లకు పతంగి యొక్క దారం చుట్టితే ప్రమాదాలు జరుగుతాయని అది పక్షులకు కూడా హానికరంగా ఉంటుందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మైదాన ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడం వల్ల పిల్లలకు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు.