calender_icon.png 12 January, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా కైట్ ఫెస్టివల్

12-01-2025 01:28:49 AM

  • పరేడ్ గ్రౌండ్స్‌లో 13 నుంచి వేడుకల నిర్వహణ
  • పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదా  ప్రతిబింబించేలా..  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం బేగంపేట్ హరిత ప్లాజాలో ఆయన అతిథులతో కలిసి కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్క  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్వీట్ స్టాల్స్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  సంక్రాంతి సందర్భంగా జనవరి 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 7వ అంతర్జాతీయ కైట్, స్వీట్  ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. 3రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో 16దేశాల నుంచి  47మంది అంతర్జాతీయ కైట్ ఫ్లుయర్స్, 14రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అలాగే జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్‌ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కైట్ ఫెస్టివల్‌ను తిలకించేందుకు ఉచిత ప్రవేశం ఉంటుందని, అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. రాబోయే రోజుల్లో కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.

కాగా ఈ ఏడాది కైట్ ఫెస్టివల్‌కు 15 లక్షల మంది దాకా వస్తారని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, పర్యాటక శాఖ సంచాలకులు జెండగే హనుమంతు కొండిబా, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డీ సోలంకి, క్లిక్ కన్వీనర్ లిబి బెంజిమన్, దేశీయ, అంతర్జాతీయ క్లుటై ప్లయర్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.