calender_icon.png 4 April, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిచెన్ టిప్స్

23-03-2025 12:00:00 AM

కొత్తిమీర, పుదీనా, మెంతి.. వంటివి కట్ చేసుకుని పెట్టుకునే సమయం ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు.. మ ట్టి ఉన్నంత వరకు వాటి కాడలు కట్ చేసి.. ఓ గ్లాస్ నీటిలో కాడలు మునిగే లా ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. లేదం టే ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెర్బ్ సేవర్స్‌ని కూడా వినిపోయగిం చుకోవచ్చు. తద్వారా అవి కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి. 

కొన్ని వంటకాల్ని తయారుచేసే క్రమం లో టొమాటోపై ఉండే తొక్క తొలగి స్తుంటాం. ఈ పని ఈజీగా పూర్తవ్వాలం టే టొమాటోల్ని ముందు పావుగంట పాటు మరిగే నీళ్లలో వేసి.. ఆ తర్వాత ఐస్ నీళ్లలో పూర్తిగా చల్లారేంత వరకు చేసి ఉంచితే సరిపోతుంది. 

కాస్త ఎక్కువసేపు ఉడికిన గుడ్లపై పెం కులు తొలగించడం కష్టం. అలాంటప్పు డు గుడ్లను ఉడికించేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా లేదంటే వెనిగర్ వేస్తే పెంకులు తీయడం సులువవుతుంది.