09-03-2025 12:00:00 AM
* బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డ్రమ్ములో బిర్యానీ ఆకులు, ఎండుమర్చి ఉంచాలి.
* పెరుగు పుల్లగా ఉంటే దానిలో మూడు చెంచాల పాలు వేసి బాగా గిలకొట్టాలి. ఇలా చేస్తే దాంట్లో ఉండే పులుపు తగ్గి, రుచి పెరుగుతుంది.
* స్వీట్స్ చేసేటప్పుడు చక్కెరకు బదులు.. చక్కెర పౌడర్ వేస్తే రుచి పెరుగుతుంది.
* క్యాబేజీ ఉడికించేటప్పుడు కాస్త వెనిగర్, నాలుగు లవంగాలు వేస్తే వాసన రాకుండా ఉంటుంది.
* ఎండు కొబ్బరి ముక్కలు వాసన రాకుండా ఉండాలంటే వాటిని కందిపప్పు డబ్బాలో భద్రపరచాలి.