* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగు పచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.