calender_icon.png 4 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిచెన్ టిప్స్

20-12-2024 12:00:00 AM

* రాగి, అల్యూమినియం పాత్రలను తోమేటప్పుడు సబ్బు పొడిలో కాస్త వెనిగర్ కలిపితే కొత్తవాటిలా తళతళలాడతాయి. 

* దొండకాయలు, బెండకాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసుకుంటే వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది. 

* కొత్తిమీర కాడల్ని కత్తిరించి నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. 

* పనీర్ తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.

* ఆహార పదార్థాలు ఉంచిన గిన్నెలకు చీమలు పట్టకుండా ఉండాలంటే అంచులకు ఆముదం రాయాలి.