ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, సగం చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
గారెల పిండి కోసం మినపప్పును నానబెడుతున్నప్పుడు చెంచా పెసరపప్పును కూడా చేర్చండి. గారెలు మెత్తగా, కమ్మగా ఉంటాయి.
కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
ఆలుగడ్డ పొట్టుతో వెండి పాత్రలుతోమితే కొత్తవాటిలా తళతళలాడతాయి.