calender_icon.png 10 January, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిస్సా కార్ కా!

10-01-2025 01:12:38 AM

  1. రాష్ట్ర రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు కలకలం
  2. ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే నగదు చెల్లింపులు 
  3. విదేశీ కంపెనీకి 55 కోట్లు బదలాయించినట్టు ఏసీబీ గుర్తింపు

* ఒక్క పైసా అవినీతి జరగలేదు. అవసరం అనుకుంటే ప్రభుత్వ అనుమతి లేకపోయినా హెచ్‌ఎండీయే నిధులు ఖర్చు చేయవచ్చు. ఇది కార్పొరేషన్ చట్టంలోనే ఉంది. కక్ష సాధింపుల్లో భాగంగానే నాపై కేసు నమోదు చేశారు. బ్రాండ్ ఇమేజ్  కోసం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ స్థాయి రేసును నిర్వహించాం. 

 మాజీమంత్రి కేటీఆర్

* ఈ-కార్ రేసుకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయి. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపాం. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్‌ఎండీయే నుంచి నిధులు బదిలీ చేసాం. రేస్ నిర్వహణ కోసం ఎంఏయూడీ, హెచ్‌ఎండీయే నిధులను ఎలా ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆరే చెప్పారు. 

 ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్

* ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుకు సంబంధించి రూ.55 కోట్లను ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసాం. నా పరిధిలోనే ఈ వ్యవహారం జరిగింది. మొత్తం చెల్లింపుల్లో రూ.46 కోట్లను విదేశీ మారక ద్రవ్యం రూపంలో చెల్లించాం. రెండో దఫా రేసింగ్‌కు ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు ముందస్తుగా చెల్లింపు చేసాం.

 హెచ్‌ఎండీయే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): తెలం గాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడిందని, కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నదని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభు త్వం ఆరోపిస్తూ వస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం వంటి అంశా లపై ఇప్పటికే విచారణ చేయిస్తోంది. తాజాగా ఫార్ములా ఈ--కార్ రేసింగ్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఫార్ములా ఈ- కార్ రేసింగ్‌లో భారీ అవినీతి జరిగిందని, దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న రేవంత్ సర్కార్ ఏసీ బీని రంగంలోకి దింపింది.

స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రాయడం, వెంటనే ఏసీబీ స్పందించి మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుచేయడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. పోటీ సంస్థకు ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఏకపక్షంగా చెల్లింపులు చేయడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై ఏసీబీతో విచారణకు సర్కార్ ఆదేశించిన విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించారు. హుస్సెన్‌సాగర్, సెక్రటేరియట్ మధ్య ఎన్టీఆర్  గార్డెన్ నుంచి ఐమాక్స్ మీదు గా 2.8 కిలోమీటర్ల మేర ఈ రేస్ సాగింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఫార్ములా -ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలకశాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్-ఫాం ఎల్‌ఎఫ్‌ఏ జరిగింది.

9, 10, 11, 12 సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఈ ఒప్పందం కుదిరింది. తొమ్మిదో సీజన్ కార్ రేస్ ను 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్డులో నిర్వహించగా, అప్పటి పురపాలకశాఖ మంత్రి ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందని, శాఖాధిపతిగా తాను ఎంవోయూ చేశానని అర్వింద్ కుమార్ ఏసీబీకి వివరించారు.

ప్రతి సీజన్‌లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్‌లో తనకు నష్టం వచ్చిందంటూ ప్రభుత్వానికి లేఖలు రాసింది. పదో సీజన్ వచ్చే సరికి ప్రమోటర్‌గా ఉండేందుకు ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. ఎఫ్‌ఈవోకు అక్టోబర్ ఐదో తేదీన రూ.23 కోట్లు, 11న మరో రూ.23 కోట్లు కలి పి మొత్తం రూ. 46 కోట్లను హెచ్‌ఎండీయే నుంచి చెల్లించారు.

పన్నుల కింద మరో రూ.9 కోట్లు కూడా హెచ్‌ఎండీయే చెల్లించింది. రేసులో హెచ్‌ఎండీయే ప్రమోటర్‌గా చేరినా అందుకు బోర్డు ఆమో దం తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్‌ఈ వో, హెఎండీఏ మధ్య ద్వుపాక్షిక ఒప్పందం 2023 అక్టోబర్ 30న కుదిరింది. దానికంటే ముందే హెచ్‌ఎండీయే డబ్బులు చెల్లించిందని ఏసీబీ విచారణలో అర్వింద్‌కుమార్ వెల్లడించారు. 

ప్రభుత్వ లేఖతో ఏసీబీ విచారణ 

2024లో మరోసారి ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహించేందుకు ముందస్తుగా ఇచ్చిన రూ.55 కోట్లపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని, ఇందులో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని అనుమానించిన ఏసీబీ.. మాజీమంత్రి కేటీఆర్‌ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏ-2గా, హెచ్‌ఎండీయే అధికారి బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ-3గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1), 13(2)తోపాటు ఐపీసీ 409, 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అవినీతి జరిగిందంటున్న ప్రభుత్వం 

ఈ పోటీల నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్‌ఎండీయే చెల్లింపులు చేయడం ప్రధాన అభియోగం. దీనిపై వివరణ ఇవ్వాలని గతంలో పురపాలకశాఖ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో సైతం జారీచేశారు.

సీఎస్ మెమోకు సమాధానం ఇచ్చిన అర్వింద్‌కుమార్ ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామని వివరణ ఇచ్చారు. ఈఠూ రేసింగ్‌లో అవినీతి జరగలేదని కేటీఆర్ అంటుంటే.. లేదు అక్రమాలు జరిగాయని రేవంత్ ప్రభుత్వం చెప్తోంది. 

ఆధారాలుంటే బయటపెట్టాలి: మాజీ మంత్రి కేటీఆర్ 

ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో ఒక్క పైసా అవినీతి జరగలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. హైదరాబా ద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతూ అభివృద్ధికి దోహదపడుతుందనే ఈ అంతర్జాతీయ స్థాయి రేసును నిర్వహించినట్టు చెప్తున్నారు.

నగర ప్రగతికి అవసరం అనుకుంటే ప్రభుత్వ అను మతి లేకపోయినా హెచ్‌ఎండీయే నిధు లు ఖర్చు చేయవచ్చని, ఇది కార్పొరేషన్ చట్టంలోనే ఉందన్నారు పేర్కొంటున్నా రు. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి జరిగిందని ఏమైనా ఆధారాలుంటే బయటపెట్టాలని లేదంటే అసెంబ్లీలో చర్చిం చాలని కేటీఆర్ అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఫార్ములా రేసు ఒప్పందంలో ఎలాంటి తప్పు లేకపోయి నా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని, న్యాయపరంగానే పోరాడతానని కేటీఆర్ అంటున్నారు. 

అర్వింద్‌కుమార్ ఆదేశాలతోనే రూ.5౫ కోట్లు బదిలీ : బీఎల్‌ఎన్ రెడ్డి

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుకు సంబంధించి రూ.5౫ కోట్లను ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకే బదిలీ చేసినట్టు ఈడీ అధికారుల ముందు హెచ్‌ఎండీ యే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఒప్పుకొన్నారు. ఈ నెల ౮న దాదాపు 6 గం టలపాటు ఈడీ  బీఎల్‌ఎన్‌డ్డిని విచారించింది.

ఎలాంటి అనుమతులు లేకుండానే రూ.54 కోట్లను ఎఫ్‌ఈవోకు ఎలా బదిలీ చేశారన్న ఈడీ అధికారుల ప్రశ్నకు.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకే బదిలీ చేసినట్టు సమాధానమిచ్చినట్టు సమాచారం. ఉన్నతాధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బు లు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు వివరించారు. తమకున్న పరిధిలోనే ఈ వ్యవహారం జరిగిందని తెలిపారు.

మొత్తం చెల్లింపుల్లో రూ.46 కోట్లను విదేశీ మారక ద్రవ్యం రూపంలో చెల్లించినట్టు, రెండో దఫా రేసింగ్‌కు ఆటంకాలు ఎదురుకాకుండా ఉం డేందుకు ముందస్తుగా చెల్లింపు చేసినట్టు తెలిపారు. రెండో దఫా రేసింగ్‌కు అడ్వాన్స్ చెల్లించ కపోతే రద్దయ్యే అవకాశం ఉండేదని, రేసింగ్‌ను సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే డబ్బులు చెల్లించినట్లు వివరించారు.  

కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు: ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ 

ఈ-కార్ రేసుకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపామని ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ చెప్తున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్‌ఎండీయే నుంచి నిధులు బదిలీ చేసినట్టు ఈడీ విచారణలోనూ వెల్లడించారు.

రేస్ నిర్వహణ కోసం ఎంఏయూడీ, హెచ్‌ఎండీయే నిధుల ను ఎలా ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆరే చెప్పారని చెప్తున్నారు. ఫార్ములా ఈ రేసు ౯వ సీజన్ ఒప్పందం చేసుకోవడం, నిధులు చెల్లించడం, పదో సీజన్ నుం చి తప్పుకోవడం, మంత్రి ఆదేశాల మేరకు ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో మధ్య 2023 అక్టోబర్ 10న ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్న ది ఏసీబీ అధికారులకు అర్వింద్‌కుమార్ వివరించినట్టు తెలిసింది.

ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పరిమితులకు లోబడే తాను విధులు నిర్వర్తించినట్టు, తన పరిధిలోని మున్సిపల్ శాఖ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను అతిక్రమించలేదని చెప్తున్నారు.