calender_icon.png 10 March, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు భాషల్లో కిస్ కిస్ కిస్సిక్

08-03-2025 12:00:00 AM

‘పింటు కి పప్పీ’.. బాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఎంటర్‌టైనర్. ప్రస్తుతం హిందీ వెర్షన్‌తోపాటు నాలుగు భాషల్లో మార్చి 21న విడుదలకు వస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషల్లో ‘కిస్ కిస్ కిస్సిక్’ పేరుతో రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ నాలుగు భాషల్లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ట్రైలర్ కూడా శనివారం విడుదల చేయనున్నారు.

లవ్, కామెడీ, యాక్షన్‌తో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందీ చిత్రం. శివ్ హరే రచనాదర్శకత్వం వహిం చిన ఈ చిత్రం ద్వారా సుశాంత్, జాన్యా జోషి, విధి వెండితెరకు పరిచయం కానున్నారు. పింటు అనే తుంటరి కుర్రాడి ప్రేమ, జీవితంలోని ఊహించని మలుపులతో రూపొందిన ఈ సినిమా.. ఎమోషన్, నవ్వులు, సర్‌ప్రైజ్‌లతో రోలర్‌కోస్టర్‌గా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని నిర్మాత విధి ఆచార్య తెలిపారు.