calender_icon.png 19 April, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగులో దారి ఏర్పాటు చేసుకున్న కిష్టారం ప్రజలు

18-04-2025 06:52:59 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఒకరికి చెప్పడం కంటే మనం చేసుకోవడం మేలు అనుకున్నారో ఏమో గ్రామ ప్రజలు. మొర్రేడు వాగు దాటడం కోసం వర్షాకాలంలో అనునిత్యం ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది అక్కడ. టేకులపల్లి మండలం కిష్టారం గ్రామంలో సొంత ఖర్చులతో జెసిబి పెట్టి వాగులో రాళ్లను తొలగించు కుంటూ  దారి శుభ్రం చేసున్నారు.

వర్షాకాలం వాగులు వచ్చి పొలాలకు వెళ్లాలంటే పడే కష్టాలు గుర్తుకొచ్చి ముందస్తుగా మొత్తం రాళ్లు తేలి నడవడానికి ఇబ్బందిగా ఉంటుండడంతో  ప్రతిరోజు వాగు దాటటము అంటే ఒక పెద్ద ఎవరెస్టు ఎక్కినంత బాధ ఉంటుందని ఇంటికి ఇంత ఖర్చును వాసులు చేసి రాళ్లను తొలగించుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కాస్త ద్రుష్టి సారించి పొలాలకు వెళ్లే మార్గాన్ని నిర్మిస్తారని ఆశిద్దాం.