calender_icon.png 9 January, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిశోర్ జీ.. యే క్యాహైజీ

05-01-2025 01:56:37 AM

* ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిశోర్

* వేదిక వద్ద లగ్జరీ వ్యానిటీ వ్యాను

* కోట్ల విలువైన వాహనం ఉండటంతో కంగుతిన్న శ్రేణులు

పట్నా, జనవరి 4: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పట్నాలోని గాంధీమైదాన్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. బీపీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ అయిందని దాన్ని సరి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ ఆయన నిరాహార దీక్ష చేస్తున్న స్థలంలో కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ వ్యాని టీ వ్యాన్ ఉండడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ వ్యాన్‌లో ఏసీ, కిచెన్, బెడ్రూం వ ంటి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. 

నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు 

ప్రశాంత్ కిశోర్ దీక్షకు దిగిన స్థలంలో లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఉండడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘అసలు అంతా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ గురిం చి ఆలోచించండి’ అని జన్ సురాజ్ అధికార ప్రతినిధి అన్నారు. 

రద్దు ప్రసక్తే లేదు.. 

డిసెంబర్ 13న బీహార్‌లో బీపీఎస్సీ కాం పిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ ప్రశ్నపత్రం లీకైందని చాలా ఆరోపణలు వచ్చా యి. చాలా చోట్ల విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులకు మద్దతుగానే ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.