ఖమ్మం : ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారు. ఖమ్మం 16 డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. కిషన్ రెడ్డి, పొంగులేటి, ఎంపీలు బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం ఖమ్మం ద్వంసలాపురం కందకట్ల ఫంక్షన్ హాల్లో ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఖమ్మం ద్వంసలాపురం కాలనీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస రెడ్డి మహిళలు అడ్డుకున్నారు. వచ్చిపోతున్నారే కానీ తనకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదని, ఆదుకోవాలని అడ్డగించారు. దీంతో మంత్రి శ్రీనివాస రెడ్డి సర్ది చెప్పడంతో మహిళలు, బాధితులు శాంతించి దారి వదిలారు.