calender_icon.png 6 January, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుభాష కనుమరుగయ్యే పరిస్థితి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

04-01-2025 12:58:28 PM

భాష వాడకం ద్వారానే పరిరక్షించగలం

హైదరాబాద్: రెండో రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు( World Telugu Federation) జరుగుతున్నాయి. మహాసభలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వాహకులు కిషన్ రెడ్డిని సన్మానించారు. తెలుగు సమాఖ్య మహాసభలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భాష వాడకం ద్వారానే పరిరక్షించగలమన్నారు. తెలుగు ముద్రించడం, సోషల్ మీడియాలో పెడితే పరిరక్షించలేమన్నారు. పిల్లలతో రోజూ బాల సాహిత్యం చదివించాలని సూచించారు. డిజిటల్ లో తెలుగుభాష క్రోడీకరించి భావితరాలకు అందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుభాష అభివృద్ధి, సంరక్షణకు డిజిటల్ రంగం దోహదం చేస్తుందన్నారు. వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. కథలు, వ్యాసాలు ఆడియో రూపలంలో అందుబాటులో ఉన్నాయని చెప్పిన కేంద్రమంత్రి తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలని కోవాలన్నారు.

బోధన భాషగా తెలుగును ప్రాచుర్యంలోకి తేవాలని కోరారు. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలని ఆకాంక్షించారు. కొత్త సాంకేతికత, కార్యక్రమాలను తెలుగులో చేపట్టాలన్నారు. వాడేర భాషలో 30 శాతమే తెలుగు, 70 శాతం ఆంగ్ర పదాలేనన్నారు. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్య ఉండాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రాంతీయ భాషల పరిరక్షణకు ప్రాథమిక స్థాయిలో మాతృభాష ఉండాలని కిషన్ రెడ్డి(Kishan reddy ) పేర్కొన్నారు. ప్రాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలన్నారు. కోర్టుల్లో  వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో కోర్టు తీర్పులు ఉండాలని వెల్లడించారు. సినిమాల పేర్లు కూడా తెలుగులో ఉండాలన్న ఆయన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సూచించారు.