calender_icon.png 1 March, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: కిషన్ రెడ్డి

01-03-2025 04:52:02 PM

అబద్దాలు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గదు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అబద్దాలు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గదని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక ప్రణాళిక ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన రూ. 10 లక్షల కోట్ల విలువైన పనులను ఇప్పటికే వివరించామని సూచించారు. తాను ఇతర కేంద్రమంత్రులను బెదిరిచానని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వచ్చినప్పటి నుంచి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి(kishan reddy Vs revanth reddy) అన్నట్లు ఉంది. ఇరువురు నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి..

కేంద్ర పథకాలు సమర్థంగా అముల చేయాలని సీఎంలకు నేను ఎన్నో లేఖలు రాశానని గుర్తుచేశారు. సీఎంలతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తిని తానని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. దేశంలో నిర్మించే 7 టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు తెచ్చానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఆర్ఆర్ఆర్ ను కేంద్ర మంజూరు చేసిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై ఉందన్న కేంద్రమంత్రి హామీల అమలును పక్కకు పెట్టి బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్నారు.. డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది? అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలిమాటలు మాట్లాడటం సరికాదని హితువు పలికారు. అభివృద్ధి పనులకు రూ. 1.66 లక్షల కోట్లు కావాలంటూ లేఖ రాశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రతిపాదించిన పనులకు రాష్ట్ర బడ్జెట్(Telangana State Budget) లో రాష్ట్ర వాటా నిధులు కేటాయించారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్న పనుల ప్రతిపాధనలను సంబంధిత కేంద్రమంత్రులకు ఇచ్చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.