హైదరాబాద్ : రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్-2 గనిలో జరిగిన ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రామగుండం ఓసీపీ-2లో పైప్ లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరమని కిషన్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్‌లైన్ల మరమ్మత్తుల్లో ఈ ప్రమాదం జరిగిందననట్లు ఆయన తెలిపారు. . కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు మంత్రి కిషన్ రెడ్డి సూచిస్తున్నాను.