హైదరాబాద్: బేగంపేట పర్యాటక భవన్ లో లోక్ మంథన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఈ ఏడాది లోక్ మంథన్ జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. శిల్పాకళా వేదికలో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్ మంథన్ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ సాంస్కృతిక మహాత్సవంగా లోక్ మంథన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ మంథన్ లో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్లొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. స్టాళ్లు, సాంస్కృతి కార్యక్రమాలను వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 22న లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రారంభిస్తారని తెలిపారు. లోక్ మంథన్ ముగింపు సమావేశంలో మోహన్ భగవత్, కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, షెకావత్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.