హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శనివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. 7 నెలలుగా జీహెచ్ఎంసీ వీధిలైట్లకు నిధుల కొరత ఉందని విమర్శించారు. కేసీఆర్(KCR) అప్పుల రాష్ట్రం చేస్తే.. కాంగ్రెస్ దాన్ని కొనసాగిస్తోందని ద్వజమెత్తారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉందని చెప్పిన కిషన్ రెడ్డి పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) హైడ్రా అనే పేరు పెట్టిందని పేర్కొన్నారు. మెట్రో రెండోదశకు కేంద్ర సాయం చేస్తుంది.. అది తన బాధ్యతని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎంఐఏం వాళ్లతో ఉంటుందని ఆరోపించారు. మూసీ సుందరీకరణ(Musi River Beautification) చేయాల్సిందేనని, కానీ పేద ప్రజల ఇళ్లు కూల్చకుండా చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.