27-02-2025 01:41:48 PM
న్యూఢిల్లీ: గనులశాఖలో నూతన పాలసీ తీసుకొచ్చి, 12 ఖనిజాల రాయల్టీని పెంచామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గనులశాఖ చాలా మార్పులు వచ్చాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 448 ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణను జీఎస్ఐ చేపట్టిందని ఆయన వెల్లడించారు. గనుల అన్వేషణలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 12 ప్రైవేటు సంస్థలు గనుల అన్వేషణలో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వం(Prime Minister Narendra Modi)లో మైనింగ్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఆఫ్ షోర్ ఖనిజాల ఉత్పత్తిని పెంచుతున్నామని పేర్కొన్నారు.