calender_icon.png 27 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో విస్తరణకు కిషన్‌రెడ్డే అడ్డు

27-02-2025 02:21:46 AM

  1. నిధుల బాధ్యత.. కిషన్‌రెడ్డి, బండిపైనే ఉంది 
  2. ఆ ప్రాజెక్టులకు నిధులు తీసుకొస్తే.. భారీ బహిరంగ సభ పెట్టి గండపెండేరం తొడుగుతా 
  3. సీబీఐ కేసుల పేరుతో బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది
  4. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు అంశా లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.  మెట్రోను కేంద్ర క్యాబి నెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని సీఎం ఆరోపించారు.

తాను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తుల ను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఉందన్నారు. తన వంతుగా చేయాల్సింది తాను చేశానని.. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇది చేస్తే.. బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి గండపెండేరం తొడుగుతానని,  సన్మానం కూడా చేస్తానని సీఎం ప్రకటించారు. కేంద్రా నికి రాష్ర్టం నుంచి పన్నులు ఎంత కడుతు న్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలని సీఎం డిమాండ్ చేశారు.

హైదరా బాద్‌కు  మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అని సీఎం గుర్తు చేశారు. కేసీఆర్ మెట్రో విస్తరణ కోసం కేసీఆర్ చేసిందేమిలేదని, పదేళ్లు తాత్సారం చేశారన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన రూ. 22,500 కోట్లు అవసరమని, ప్రస్తుతం ఆదాయం రూ. 18,500 కోట్లు మాత్రమే వస్తుందన్నారు. వేతనాలకు రూ. 6,500 కోట్లు, వడ్డీలకు రూ. 6,800 కోట్లు చెల్లిస్తున్నామని సీఎం వివరించారు. ఆదాయం రూ. 22 వేల కోట్లకు పెంచేందు కు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. 

కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు

‘రాష్ర్టంలో ముడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతిచెందితే.. కేటీ ఆర్ ఎందుకు స్పందించలేదు. కేదార్, కాళేశ్వ రం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసువేసిన లింగమూర్తి మరణాలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. జ్యూ డిషియల్ విచారణ ఎందుకు  కోరడం లేదు?’ అని  సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ బిజినెస్‌లో కేదార్ భాగస్వామి అన్నారు.

ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందన్నారు. ప్రభుత్వాని కి ఫిర్యాదు వస్తే తాము విచారణ చేపడతా మని సీఎం తెలిపారు. కేదార్ మృతదేహం ఇండియాకు రానుందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్‌లోనే ఉన్నారని సీఎం తెలిపారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై ఇప్పుడేమి మాట్లాడబోనని, ఆ ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు వచ్చాకనే మాట్లాడతానని అన్నారు. 

ఎస్‌ఎల్‌బీసీ పాపం కేసీఆర్‌దే..  

 ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్లో 11 సంస్థలు పని చేస్తున్నాయని సీఎం చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎస్‌ఎల్బీసీ ని వంద శాతం పూర్తి చేసి తీరుతామన్నారు. కమీషన్లు రావనే ఉద్దేశంతోనే ఎస్‌ఎల్బీసీ పనులను  కేసీఆర్ పక్కన పెట్టేశారని సీఎం రేవంత్‌రెడ్డి  ఆరోపించారు. పదేళ్లు అధికారం లో ఉండి ఎలాంటి పనులు చేయకపోవడం తో ప్రమాదం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయంలో 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్త యిందని, కాంగ్రెస్‌కు పేరు వస్తుందని ఏ పనులు చేయకపోవడం వల్లే మెసీన్ బేరిం గ్స్ పాడయ్యాయని అన్నారు.

కేసీఆర్‌కు ఈ ప్రాజెక్టులో ఏమి లాభం లేదనే పనులు పక్కన పెట్టారని, మెషీన్స్ అన్ని తప్పుపట్టి పోయి ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం తెలిపారు.  ఎట్టి పరిస్థితు ల్లోనూ ఎస్‌ఎల్బీసీని పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు పెరిగిన అంచనాల తో కలిపి రూ. 5,000 కోట్ల లోపే ప్రాజెక్టు పూర్తవుతుందని, ఇది పూర్తయితే  మూడు న్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం వివరించారు.

బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్..

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతే జరిగిందని సీఎం ఆరోపించారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పందించిన సీఎం.. ఉప ఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడూ ఉందని సీఎం  గుర్తు చేశారు. పక్కపార్టీల నుంచి వచ్చిన వాళ్లను మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్నారు.