calender_icon.png 2 April, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

27-03-2025 12:27:20 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియ నిలిపివేయాలని లేఖలో కోరారు. ఆ భూమికి ఆనుకుని వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 400 ఎకరాల భూమి పక్కనే హెచ్ సీయూ ఉందని సూచించారు. విద్యార్థులకు, పర్యావరణ ప్రేమికులకు ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమీక్షిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం అసెంబ్లీకి తెలియజేశారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) విద్యార్థులు చేస్తున్న నిరసనకు భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.