రాహుల్ ప్రధాని కావడం ఖాయం: హనుమంతరావు
హైదరాబాద్, జులై 22 (విజయక్రాంతి): రాహుల్ గాంధీపై విమర్శ లు చేసే అర్హత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విజయం సాధిస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతాడన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఊదరగొట్టారని, కానీ 300 సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందన్న విషయాన్ని మర్చిపోవద్ద న్నారు. సబ్‌కా సాత్... సబ్‌కా వికాస్ అంటున్న బీజేపీ.. కేంద్ర మంత్రి వర్గంలో మైనార్టీలకు చోటెందుకు ఇవ్వలేదని నిలదీశారు. కుల గణన, కుల వృత్తులను కూడా మోదీ ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు.