30-03-2025 12:50:30 AM
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘట నలో రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడిన బాధితురాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శని వారం రాత్రి యశోదా ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణనిస్తున్నామని తెలిపిన ఆయన, ఈ అంశంపై అక్కడి నుంచే కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రైళ్లలో భద్రత పెంచాలని కోరారు. రైల్వే డీజీ, ఐజీతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.