హైదరాబాద్: కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రమాదకారి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అధికారం కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని చెప్పారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుందన్నారు. అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోందని ద్వజమెత్తారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి దిగజారారని కిషన్ పేర్కొన్నారు. భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదని తెలిపారు. భద్రతా బలగాలను కాంగ్రెస్ నేతలు అవమానపరిచారని స్పష్టం చేశారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నందున అణిగిమణిగి ఉండాలని చెబుతున్నారన్న ఆయన పాకిస్థాన్ కు అణిగిమణిగి ఉండే అలవాటు కాంగ్రెస్ కు ఉందని ఎద్దేవా చేశారు. పాక్ దాడులను భారత్ పూర్తిగా నిలువరించిందని తెలిపారు. పాక్ తోకను పూర్తిగా కత్తిరించి నడ్డివిరిచామన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ అసమర్థత వల్ల పాక్ అడ్డుకట్ట వేయలేకపోయారని ఆరోపించారు.