calender_icon.png 15 November, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సవాల్ స్వీకరిస్తున్నాం.. మూసీ పక్కనే నిద్రిస్తాం: కిషన్ రెడ్డి

15-11-2024 01:23:58 PM

పేదల కోసం చావడానికైనా సిద్ధం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఇళ్లు కూల్చొద్దు అంటే.. బుల్‌డోజర్లతో తొక్కిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. పేదల కోసం చావడానికైనా సిద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం సవాల్ ను స్వీకరిస్తున్నాం.. రేపు పేదల ఇళ్లలో మూసీ పక్కనే నిద్రిస్తామని కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలు చేశామని అసత్యాలు పలికారని విమర్శించారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ, అబద్ధాలు, అరాచకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బోనస్ అని.. బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందన్నారు. ఓవైసీ కనుసన్నల్లోనే పోలీస్ నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ చర్యల వల్ల కలెక్టర్ పై దాడి జరిగేలా చేశారన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఏకైక ఏటీఎం సెంటర్ గా తెలంగాణ ఉందని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనానికి ప్రతిపక్షాలు అడ్డొస్తున్నాయని సీఎం ఆరోపించారు. మూసీ పునర్జీవనానికి బీజేపీ వ్యతిరేకం కాదు.. మూసీ అభివృద్ధి కార్యాచరణ, డీపీఆర్ లేదని కిషన్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్ లో ఇళ్లు  కూలుస్తూ.. నల్గొండ రైతులను రెచ్చగొట్టారని కిషన్ రెడ్డి తెలిపారు. పేదల ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తాము మద్దతిస్తామన్నారు. కేటీఆర్ అరెస్టు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది దుష్ప్రచారమని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ ఏ సంతకం పెడుతున్నారని కేంద్రం పర్యవేక్షిస్తుంది..?, కేంద్రంలో కేటీఆర్ ఎవరినీ కలవలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.