గిలెస్పీకి కోచ్‌గా బాధ్యతలు
కరాచీ: ఆట కంటే ఆటేతర విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పాక్ క్రికెట్‌లో మరోమారు కుదుపు సంభవించింది. పరిమిత ఓవర్ల కోచ్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తనంతట తానుగా తప్పుకున్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ చివర్లోనే పాక్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గ్యారీ ఆరు నెలలు కూడా ఉండలేకపోయాడు.
భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కిర్‌స్టెన్‌ది కీలకపాత్ర పోషించా డు. అటువంటి కిర్‌స్టెన్ పాక్ జట్టును మాత్రం ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోవడంతో సోమవారం పదవికి రాజీనామా చేశాడు. కిర్‌స్టెన్ ఇలా అనూహ్యంగా పదవి నుంచి దిగిపోవడానికి పాక్ క్రికెట్ బోర్డే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జట్టు కూర్పులో కోచ్‌ను పట్టించుకోకపోవడం వల్లే కిర్‌స్టెన్ పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ టెస్టు క్రికెట్ కోచ్‌గా వ్యవహరించిన గిలెస్పీ ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.