- 400 మీటర్ల ఈవెంట్‌లో అర్హత
పంచ్‌కులా (హర్యానా): భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కిరణ్ పహాల్ ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. గురువారం జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల సెమీఫైనల్లో కిర ణ్ 50.95 సెకన్లలో గమ్యాన్ని చేరింది. తద్వారా ఒలింపిక్ కటాఫ్ నిర్దేశిత సమయాన్ని అందుకొ ని కిరణ్ పారిస్ బెర్త్ సాధించింది. ఈ సీజన్‌లో కిరణ్‌కు ఇదే బెస్ట్ టైమింగ్ కావడం గమనార్హం. భారత్ తరపున 400 మీటర్ల రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన రెండో అథ్లెట్‌గా కిరణ్ నిలిచింది.
గతంలో హిమదాస్ 50.79 సెకన్లలో 400 మీటర్ల గమ్యాన్ని చేరి బెస్ట్ టైమింగ్ సాధించింది. గుజరాత్‌కు చెందిన దేవీ అనీబా (53.44 సెకన్లు), కేరళకు చెందిన స్నేహ (53.51 సెకన్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మహిళల 5వేల మీటర్ల రేసులో అంకిత స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆమె రేసును 16 నిమిషాల 10.31 సెకన్లలో పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచింది. పురుషులు విభాగంలో 5వేల మీటర్ల రేసును 13 నిమిషాల 34.67 సెకన్లలో పూర్తి చేసి పసిడి చేజెక్కించుకున్నాడు. మంజు బాలా హేమర్ త్రోను 63.66 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ దక్కించుకుంది.