calender_icon.png 16 January, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిరణ్ పహాల్ విఫలం

07-08-2024 03:41:31 AM

పారిస్: ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల రేసులో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ నిరాశపరిచింది. సెమీస్ బెర్తు కోసం మంగళవారం నిర్వహించిన రెపిచేజ్ హీట్ రౌండ్‌లో కిరణ్ ఆరో స్థానంలో నిలిచింది. 400 మీటర్ల రేసులో కిరణ్.. గమ్యాన్ని 52.59 సెకన్లలో చేరింది. కిరణ్ పహాల్ గతంలో 400 మీటర్ల రేసులో 50.92 సెకన్లు బెస్ట్ టైమింగ్ నమోదు చేసింది. అయితే సోమవారం హీట్స్‌లో 52.51 సెకన్లు నమోదు చేసి రెపిచేజ్‌కు అర్హత సాధించిది. కానీ రెపిచేజ్‌లోనూ కిరణ్ తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయింది.ఇప్పటికే హీట్స్ నుంచి టాప్ నిలిచిన అథ్లెట్లు సెమీఫైనల్‌కు చేరుకోగా..  నాలుగు రెపిచేజ్ హీట్స్‌లో తొలి స్థానంలో నిలిచిన అథ్లెట్లు సెమీస్ బెర్తు దక్కించుకున్నారు.