calender_icon.png 18 April, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవోపా అధ్యక్షుడిగా కొత్త కిరణ్ కుమార్

11-04-2025 04:52:36 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల అవోపా యూనిట్ అధ్యక్షుడిగా కొత్త కిరణ్ కుమార్ ను వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అవోపా అధ్యక్షుడు వజ్జల రాజమౌళి మాట్లాడుతూ... గత ఎంతో కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అవోపా ముందుంటుందని అన్నారు. ఆవోపా నిర్వహించిన ఎన్నికలలో కొత్త కిరణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. అన్నివేళలా అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమానికి చేదోడు వాదోడు అందించవలసిందిగా సూచించారు.

అనంతరం కొత్త కిరణ్ కుమార్ మాట్లాడుతూ... నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతకు శాయశక్తుల న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, జోనల్ చైర్మన్ పల్లెర్ల శ్రీహరి, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, మంచిర్యాల అవోపా అధ్యక్షుడు శ్రీనివాస్, లక్షెట్టిపేట పూర్వ అధ్యక్షుడు  సుదర్శన్, సీనియర్ అవోపా జిల్లా నాయకులు సత్తయ, నరేందుల భీమన్న తదితరులు పాల్గొన్నారు.