calender_icon.png 27 December, 2024 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో కిరణ్ జార్జి

08-11-2024 01:11:00 AM

కొరియా మాస్టర్స్

ఇస్కాన్ సిటీ (కొరియా): కొరియా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్ కిరణ్ జార్జి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో కిరణ్ 21-17,  19-21, 21-17తొ  చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌పై విజయం సాధించాడు. దాదాపు గంటన్నర పాటు సాగిన పోరులో రెండు గేములను కిరణ్ గెలవగా.. ఒక గేమ్‌ను చి యు గెలుపొందాడు. మూడో గేమ్‌లో తొలుత 8 కిరణ్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచినప్పటికీ మధ్యలో చియు 14-14, 17-17తొ  స్కోర్లు సమం చేసి రేసులో నిలిచాడు.