calender_icon.png 15 January, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండు కుండను తలపిస్తున్న కిన్నెరసాని

14-07-2024 06:07:15 AM

400 అడుగులకు చేరిన నీటి మట్టం

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో కొత్త నీరు చేరుతోంది. కిన్నెరసాని జలాశయం నీటి మట్టం శనివారం ఉదయం వరకు 400.60 అడుగులకు చేరుకొంది. ప్రస్తుతం 750 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకొంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు నీటి మట్టం 15 అడుగులకు చేరుకొంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నీటి మట్టం 15 అడుగులు చేరుకొంది.