calender_icon.png 11 January, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సముద్రం నేపథ్యంలో కింగ్‌స్టన్

08-01-2025 12:00:00 AM

నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్  కథానాయకుడిగా వస్తున్న మరో చిత్రం ‘కింగ్‌స్ట్టన్’. సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ అడ్వంచర్ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ ప్రకాశ్ డైరెక్ట్ చేస్తుండగా జీవీ ప్రకాశ్ సరసన దివ్యభారతి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో ఇంకా ‘మెర్కు తొడార్చి మలై’ ఫేమ్ ఆంటోని, చేతన్, కుమారవేల్, సాబు మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను స్టార్ హీరో శివకార్తికేయన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఉమేశ్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. “జీవీ ప్రకాశ్‌కుమార్ ‘కింగ్‌స్టన్’లో అనేక అంశాల్లో పాలుపంచుకున్నారు.

ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో ఈ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది నటుడిగా అతని 25వ చిత్రం. ఈ సినిమా టీజర్‌ను జనవరి 9న విడుదల చేయనున్నాం” అని తెలిపారు. హారర్ -అడ్వెంచర్ జానర్‌కు చెందిన ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ: దిలీప్ సుబ్బరాయన్; క్రియేటివ్ ప్రొడ్యూసర్: దినేశ్ గుణ; సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; మాటలు: ధివేక్; ఎడిటర్: శాన్ లోకేశ్; ఆర్ట్: ఎస్‌ఎస్ మూర్తి.