01-03-2025 12:00:00 AM
జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్‌స్టన్’. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ‘కింగ్‌స్టన్’ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించారు. మార్చి 7న విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
సముద్ర తీరంలోని ఒక ఊరిలో ఏదో ఉందని.. ప్రచారం జరుగుతూ ఉంటుం ది. అదేంటో తెలుసుకునేందుకు హీరో సముద్రంలోకి వెళతాడు. సముద్రంలోకి హీరో ఎందుకు వెళ్లాడు? అనే ఆసక్తికర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతోంది. సముద్రంలో సాహసాలను, దెయ్యాలను, ఫాంటసీనీ కలగలిపి ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందనే భావాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటించింది.