calender_icon.png 17 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ @ 250!

17-01-2025 01:35:36 AM

నాగర్‌కర్నూల్, జనవరి 16 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ర్టంలో కింగ్ఫిషర్ బీర్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించడంతో నాగర్కర్నూల్ జిల్లా లోని మద్యం దుకాణదారులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో బీరు బాటిల్ నుండి సుమారు 20 నుంచి 30 వరకు అదనంగా వసూళ్లు చేస్తుండగా గ్రామీణ ప్రాంత బెల్టు షాపులు మరో 20నుండి 30వరకు అద నంగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు వ్యక్త మవుతున్నాయి.

మద్యం దుకాణాల నుండి ఆయా బెల్టు దుకాణాలకు కింగ్ ఫిషర్ బీర్లు కాటన్ లను గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్లో అధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుం టున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు దుకాణాల్లో ఒక్కో కింగ్ఫిషర్ స్ట్రాంగ్ బీర్ రూ 250 ధర నిర్ణయించి అత్యధిక డిమాం డ్‌తో విక్రయాలు జరుపుతున్నారు. కింగ్ఫి షర్ సంస్థ ధరను పెంచే నిర్ణయాన్ని రాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ సంస్థ సరఫ రాను నిలిపివేయడం వల్ల ఈ విపత్తు ఏర్ప డిందని చర్చ నడుస్తోంది.

దీంతో అక్కడక్కడ స్టోరేజ్ లో ఉన్న స్టాక్ బీర్లను పొదుపుగా వాడుకుంటూ బ్లాకులో అధిక ధరను అ మ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి.సంక్రాంతి పర్వదినం సందర్భంగా కింగ్ ఫిషర్ బీర్లు తాగాలను కున్న మద్యం ప్రియుల జేబులకు బెల్టు దుకాణాలు చిల్లులు పెడుతున్నాయని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో అత్యధిక ధరకు అమ్మకాలు జరుపుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చూసీచూ డనట్లుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడంలేదని మద్యం ప్రియలు మండి పడుతున్నారు.