హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి హైనెకెన్(Heineken ), కింగ్‌ఫిషర్(Kingfisher) వంటి ఏడు రకాల బీర్ల సరఫరాను నిలిపేస్తున్నట్లు ఆయా కంపెనీలు వెల్లడించాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(Telangana Beverages Corporation Limited)కి బీర్ సరఫరాను నిలిపివేసినట్లు యునైటెడ్ బ్రూవరీస్ బుధవారం తెలిపింది. సెబి లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, తెలంగాణ టిజిబిసిఎల్(TGBCL)కి తామ బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని కంపెనీలు నిర్ణయించింది. నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్న యునైటెడ్ బ్రూవరీస్(United Breweries) వెల్లడించింది. ఐదేళ్లుగా ధరలు పెంచలేదని, ఫలితంగా రాష్ట్రంలో భారీ నష్టాలు వస్తున్నాయి. దీంతో బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ వెల్లడించింది. కంపెనీ గత బీర్ సరఫరా కోసం టీజీబీసీఎస్ ద్వారా చెల్లించని గణనీయమైన ఓవర్‌డ్యూలు ఫలితంగా, టీజీబీసీఎస్ కి తామ బీర్ నిరంతర సరఫరా ఆచరణీయం కాదని తయారీ సంస్థలు పేర్కొన్నాయి.