calender_icon.png 25 December, 2024 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధితో ఇందిరమ్మ రాజ్యం : ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి

06-10-2024 05:23:53 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంతో పాటు మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధితో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం మునిసిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించి చెన్నకేశవ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం హైమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు.