calender_icon.png 26 March, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు భాగాలుగా కింగ్‌డమ్

23-03-2025 12:49:08 AM

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించనున్నారట.

ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “కింగ్‌డమ్‌ని తొలుత రెండు భాగాలుగా రూపొందించాలనుకోలేదు. స్టోరీ డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే రెండో భాగం కోసమని మొదటి భాగం కథనేమీ పెంచలేదు. రెండో భాగానికి టైటిల్ ఏది పెట్టాలన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం” అని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకూ ఏ చిత్రానికీ సీక్వెల్ చేసింది లేదు. ఇదే తొలిసారి కానుంది. ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.