నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాస్‌లో.. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:39 గంటలకు విడుదల చేశారు.
ట్రైలర్‌ను చూస్తే.. 2 నిమిషాల 44 సెకన్ల నిడివితో అద్భుతంగా ఉంది. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్లంతా ఆయనను డాకు అనేవాళ్లు. మాకు మాత్రం మహారాజ్’ అంటూ ఒక పాప వాయిస్‌తో ట్రైలర్‌ను ప్రారంభించిన తీరు మెప్పించింది. డాకు మహారాజ్‌గా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. బాలకష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది. విభిన్న రూపాల్లో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజ్‌గా, తర్వాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాల్లో కనిపిస్తున్నారు. బలమైన కథాకథనాలతో.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్‌తో స్పష్టమైంది. ట్రైలర్‌లో డాకు మహారాజ్‌ను ఢీకొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ కనిపించారు. కీలక పాత్రధారులైన శ్రద్ధాశ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, మకరంద్ దేశ్‌పాండే పాత్రలను కూడా ట్రైలర్‌లో పరిచయం చేశారు.
ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. బాలకృష్ణ ఈ చిత్రంలో డబుల్ రోల్ పోషించారని.. ఒకటి ప్రస్తుత కథలోని పాత్ర కాగా, మరొకటి పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంతో ఉన్న పాత్ర అని తెలుస్తోంది. చిన్న పాపతో సాగే ఎమోషన్‌తోపాటు ప్రజలను రక్షించే హీరో కథగా సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా, ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగిల్ ఉన్నాడు’ అంటూ బాలకృష్ణ గురించి చెప్పిన డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ చివర్లో విలన్ అడిగిన ఎవడ్రా నువ్వు?’ అన్న ప్రశ్నకు బాలకృష్ణ మైఖేల్ జాక్సన్’ అని చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: తమన్; ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్; కళా దర్శకుడు: అవినాష్ కొల్లా; కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్.