calender_icon.png 22 September, 2024 | 6:04 PM

హైదరాబాదే కింగ్

06-09-2024 01:32:01 AM

  • పరిశ్రమలకు అన్ని వసతులు 
  • దేశంలో మరే నగరానికీ లేవు
  • సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కు స్వాగతం 
  • కృత్రిమ మేధకు కేంద్రంగా హైదరాబాద్
  • ఏఐ పరిశ్రమ కోసం ప్రత్యేక విధానం
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి 
  • గ్లోబల్ ఏఐ సమ్మిట్ ప్రారంభం 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): పరిశ్రమల స్థాపనలో మనదేశంలో హైదరాబాద్ నగరానికి ఉన్నన్ని అనుకూలతలు ఇతర ఏ నగరానికీ లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ నగరం సర్వ సన్నద్ధంగా ఉన్నదని తెలిపారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్’ అనే థీమ్‌తో గురువారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌ను సీఎం ప్రారంభించారు.

25 కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏఐ రోడ్ మ్యాప్‌ను సీఎం విడుదల చేశారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో వివరించారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని ఏఐ హబ్‌గా తీర్చిదిద్ద బోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనమని పేర్కొన్నారు. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కు అందరికీ స్వాగతం అని అన్నారు. ఫ్యూచర్ సిటీని గొప్ప ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే సంకల్పంలో అందరూ భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. 

భవిష్యత్తును సృష్టిస్తాం

భారతదేశ భవిష్యత్తుకు హైదరాబాద్ నగరం ప్రధాన ఆధారంగా మారుతున్నదని సీఎం అన్నారు. దేశ భవిష్యత్తుకు హైదరాబాద్ సిటీలా మరే ఇతర నగరం పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదని పేర్కొన్నారు. సవాళ్లను స్వీకరించడంతోపాటు భవిష్యత్తును కూడా సృష్టిస్తామని ప్రకటించారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏఐ కోసం చాలా చర్యలు తీసుకున్నాం. ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నాం. తెలంగాణ ఏఐ మిషన్ లేదా నాస్కామ్ భాగస్వామ్యంతో టీ తెలంగాణలో ఏఐ ఫ్రేమ్ వర్క్‌ను అమలు చేయడంలో మాకు సహకరిస్తాయి. పరిశ్రమ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది’ అని వివరించారు. 

సాంకేతికతతోనే మార్పు

సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటి రైలు ఇంజిన్ ఆవిష్కరణ తర్వాత ప్రపంచం పూర్తిగా మారిందని, విమానం ఆవిష్కరణతో ప్రపంచం స్వరూపమే మారుపోయిందని తెలిపారు. కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ వంటివన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మనతరం చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ అని తెలిపారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం ఉంటుంది కానీ.. అది మన జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయనే భయం ఉండటం సహజమని తెలిపారు.   

రాష్ట్రంలో ప్రగతిశీల ప్రభుత్వం: బీవీఆర్ మోహన్‌రెడ్డి

టెక్నాలజీ అభివృద్ధి, వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంటుందని నాస్కామ్ ఫౌండర్ చైర్‌పర్సన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, విద్యా కమిషన్ వంటి అభివృద్ధికి ఉపయోగకరమైన పనులను ప్రభుత్వం చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులతోపాటు ప్రగతిశీల ప్రభుత్వం ఉందని ప్రశంసించారు. ఏఐ అభివృద్ధిలో ముందడుగు వేయడంలో అందరి ఆలోచనలను పంచుకునేందుకే ఈ సదస్సు అని స్పష్టం చేశారు. దేశ ఐటీ వృద్ధిలో తెలంగాణ ప్రాత కీలకమని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో ఏఐపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రముఖులతో భేటీ

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అయితే సదస్సు ప్రారంభోత్స వానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. జేఫూవూ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలివాల్‌తో సమావేశమై ఏఐ రంగం అభివృద్ధిపై చర్చించారు. యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ఎల్‌ఎల్‌పీ సీఈవో సునీల్ గుప్తాతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చించారు. 

సీఎంతో ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ డానియెలా కాంబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్ శివారులో 200 ఎకరాల్లో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనబరిచారు. సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఏఐ సిటీ విజువల్ ప్రజేంటేషన్

గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఏఐ సిటీ నమూనాను సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. బటన్ నొక్కి ఏఐ సిటీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజువల్ ప్రజేంటేషన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత, ఆయా రంగాల్లో ఏఐ పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చేకూరే ప్రయోజనాలను ఈ విజువల్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. 

తెలుగులో ఏఐ సేవలు

ఇప్పటివరకు ఏఐ శిక్షణ, సేవలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతన్నాయి. అయి తే తెలంగాణలో మాత్రం రాబోయే రోజుల్లో తెలుగులోనూ ఏఐ శిక్షణ, సేవలను అందించనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ప్రాంతీయ భాషల్లో ఏఐ శిక్షణ అందించడం ద్వారా విద్యార్థులకు మరింత నైపుణ్యం పెరిగేందుకు అవకాశం లభింస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. ఈ సదస్సులో  వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్