కరీంనగర్, జనవరి 18 (విజయక్రాంతి) : నగరంలోని కిమ్స్ ఎంబీఏ కళాశాలలో శనివారం కార్నివల్-2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పొందడమే కాదు ఉద్యోగావకాశాలను కల్పించే మెలకువలను అందించే శక్తి మేనేజ్మెంట్ విభాగానికి ఉంటుందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్రావు మాట్లాడుతూ మేనేజ్మెంట్ విభాగంలో మంచి భవిష్యత్తు, గొప్ప కార్యాచరణ ఉంటుందని తెలిపారు. విద్యార్ధిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో సిబ్బంది సందీప్, సుమలత, కళ్యాణ్, ఝాన్సీ, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.