03-05-2024 12:35:13 AM
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ రాసలీలలు
ప్యాంగ్యాంగ్, మే 2: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అరాచకాలు అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు సుఖం అందించేందుకు చిన్నపాటి సైన్యమే ఏర్పాటు చేసుకున్నారట. ఏడాదికి 25 మంది అందమైన అమ్మాయిలను ఎంచుకుంటారని పార్క్ అనే యువతి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. చిన్న వయసున్న అమ్మాయిలను అందం ఉండి, నమ్మకమైన వారు అనిపించిన వారిని ఎంచుకుంటారంటూ తెలిపారు. ‘అందమైన అమ్మాయిల కోసం ప్రతి స్కూల్ వెతుకుతారు. ఒకవేళ అందమైన అమ్మాయిలు దొరికితే వారి కుటుంబ స్థాయి చూస్తారు. తర్వాత వారి రాజకీయ నేపథ్యం చూస్తారు. అమ్మాయి బంధువులు, తల్లిదండ్రులు ఉత్తర కొరియా నుంచి పారిపోతే వారిని ఎంచుకోరు. ఆ అమ్మాయి బంధువులు దక్షిణ కొరియాలో ఎవరైనా ఉంటే వారిని కూడా తిరస్కరిస్తారు’ అని పేర్కొన్నారు.