calender_icon.png 6 November, 2024 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్ కర్తవ్యం..? ఉత్తర కొరియాలో 30 మందికి డెత్ పెనాల్టీ

04-09-2024 12:02:40 PM

ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు  కిమ్ జోంగ్ ఉన్ తీరే వేరు... కిమ్ నాస్తి.. కిమన్నాస్తిగా.. ఏం చేయాలో..? ఏం చేయకూడదో..? తెలియని సందిగ్ధావస్థలో అధికారగణం ఉన్నారని ఆరోపిస్తూ ఏకంగా.. 30 మంది ప్రభుత్వాధికారులకు కిమ్ మరణశిక్ష విధించారట. ఉత్తర కొరియాలో నియంత పాలన చిన్న చిన్న తప్పిదాలకు ఘోరమైన  శిక్షలు ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల ఆదేశంలో భారీ వర్షాలతో అతలాకుతలం అయిందన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించలేదంటూ అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. విధులు సరిగా నిర్వహించలేదంటూ 30 మంది అధికారుల కు మరణ శిక్ష విధించారని దక్షిణ కొరియా  మీడియా ొక కథనాన్ని వెలువరించింది.  చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షయల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా మరణ శిక్ష పడిన వారిలో ఉన్నట్లు చెబుతున్నారు. జూలై ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలకు 4వేలమంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.