calender_icon.png 15 October, 2024 | 6:55 AM

కిమ్ మరో పైశాచికత్వం

15-10-2024 02:18:09 AM

బార్డర్‌లో రవాణా వ్యవస్థ ధ్వంసం

సియోల్, అక్టోబర్14: ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ ఎవరూ ఊహించని పనికి పూనుకున్నారు. తమ దేశం నుంచి దక్షిణకొరియా వైపు వెళ్లే అన్ని రవా ణా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసే ఆలోచన చేస్తున్నట్టు సౌత్ కొరియా ఆర్మీ తెలిపి ంది. భవిష్యత్‌లో ఒకవేళ యుద్ధం జరిగితే సౌత్ కొరియా తమ దేశంలోకి చొచ్చుకుని రాకుండా ఉండడానికి కిమ్ ఈ చర్యకు  పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.

దీనిలో భాగంగా రోడ్, రైల్వే మార్గాలను ఇప్పటికే వివిధ యంత్రాల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. మంగళవారం నుంచి పనులు ప్రారంభం కావచ్చని భావిస్తు న్నారు. కాగా గత కొన్ని నెలలుగా రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇటీవల ఉత్తరకొ రియా దాదాపు 6,000 చెత్త బెలూన్లను సౌత్ కొరియాలోకి పంపి తాము అనుకున్న ప్రదేశంలో వాటిని జార విడువడంతో ఇరుదేశాల మధ్య పరిస్థితి ఒక్కసారిగా మారిపో యింది. వీటికి జీపీఎస్ పరికరాలను అమర్చినట్లు దక్షిణ కొరియా గుర్తించింది.